Home  »  TV News  »  Podharillu : నారాయణ కుటుంబాన్ని అడ్డుకున్న తాయారు.. ఊహించని షాక్ ఇచ్చిన ఫ్యామిలీ!

Updated : Aug 15, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ - 180లో..   రుద్రవరంలో నారాయణ కుటుంబం ఉంటారు. మాధవ్ గతంలో ప్రేమించిన అమ్మాయి గురించి మాట రావడంతో తాయారు కంగారుపడుతుంది. మాధవ్ మాత్రం.. ఆమెకు పెళ్లయింది.. ఆమె గురించి మాట్లాడటం కూడా తప్పే అంటూ విషయం ఆపేస్తాడు. మరోవైపు చక్రి, మహా, మనీషా ఒకే గదిలో ఉండే పరిస్థితి రావడంతో సరదా గొడవలు జరుగుతాయి. తాయారు మాత్రం చక్రి, మహాలక్ష్మీకి నిజంగా పెళ్లయిందా అని అనుమానిస్తుంది. మీ ఇద్దరికీ నిజంగానే పెళ్లయిందా.. వాడు వేరే చోట పడుకుంటున్నాడేంటని తాయారు అడుగుతుంది. మా మధ్య గొడవలు ఉన్నాయని చెప్పగానే మీరు సెట్ చేస్తారా  అని మహా కౌంటర్ ఇస్తుంది. ఇదిలా ఉండగా, శైలు కోసం సురేష్ తన స్నేహితుడు ప్రకాష్‌ను తీసుకొస్తాడు. ప్రకాష్‌కు మంచి ఉద్యోగం, ఆస్తి ఉన్నాయని తెలుసుకుని శైలు సంతోషిస్తుంది. నాకు శైలు నచ్చింది.. రేపే పెళ్లి చేసుకుంటానని ప్రకాష్ చెప్తాడు.

మరోవైపు నారాయణను చంపేందుకు రౌడీలు రుద్రవరం సత్రం దగ్గరకు వస్తారు. కానీ మహా వారిని చూసేస్తుంది. ఉదయం అందరు గుడికి బయలుదేరతారు.  తాయారు ముందుగానే నారాయణ కుటుంబాన్ని అడ్డుకునేలా అక్కడి వారిని రెచ్చగొడుతుంది. దుర్గ అక్కను చంపిన నారాయణ ఇన్నేళ్లు ఊరికి రాలేదు.. విరాళం కూడా ఇవ్వలేదు. అలాంటి వాళ్లకు ఇక్కడ మొక్కులు చెల్లించుకునే హక్కు ఉందా అని తాయారు ప్రశ్నిస్తుంది. దీంతో పూజారి, ధర్మకర్తలు నారాయణ కుటుంబాన్ని అడ్డుకుంటారు. నేను ఇదే ఊరిలో పుట్టాను. అమ్మను దర్శించుకునే హక్కు నాకు లేదా అని నారాయణ ప్రశ్నిస్తాడు. చివరకు నారాయణ తన కొడుకులు, కుటుంబ సభ్యుల సహాయంతో 25 ఏళ్ల విరాళాన్ని ఒకేసారి చెల్లించి.. ఇప్పుడు మాకు కూడా అమ్మవారిని దర్శించుకునే హక్కు ఉందా అని నిలదీస్తాడు. ధర్మకర్తలు వారి మొక్కులు ముందుగా చెల్లించుకోవచ్చని చెప్తారు.

ఇక గుడి దగ్గర కొత్త జంట గాయత్రి, వినోద్ ఓడిబియ్యం పోసుకుంటారు. అదే సమయంలో నారాయణ, చక్రి మహాను కూడా ఓడిబియ్యం పోసుకోమని పిలుస్తారు. దీంతో తాయారుకు మహా, చక్రిల పెళ్లిపై మరింత అనుమానం వస్తుంది. అసలు మీకు పెళ్లయిందా.. మహాలక్ష్మీ ఎందుకు రావడం లేదని తాయారు అనుమానిస్తుంది. ఈమెకు డౌట్ వస్తే మన కథ వీధి వరకు వెళ్లిపోతుందని చక్రి కంగారుపడతాడు. మహా మాత్రం ఏం చేయాలో తెలియక పెద్ది వైపు చూస్తుంది. నీ ఇష్టం.. నువ్వే నిర్ణయం తీసుకోమని పెద్ది అంటాడు. మహా ఆలోచనలో పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu, Star Maa Serials, Podharillu Latest Episode, Narayana Family, Telugu Serials






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.